ఈఆర్‌సీ నిర్ణయంపై జగదీష్‌ రెడ్డి ఫైర్‌.. అదానీకే లాభం అంటూ.. | Jagdish Reddy Serios On Electricity Regulatory Commission Decision  | Sakshi
Sakshi News home page

ఈఆర్‌సీ నిర్ణయంపై జగదీష్‌ రెడ్డి ఫైర్‌.. అదానీకే లాభం అంటూ..

Feb 18 2023 3:24 PM | Updated on Feb 18 2023 4:22 PM

Jagdish Reddy Serios On Electricity Regulatory Commission Decision  - Sakshi

సాక్షి, సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఈఆర్‌సీ(Electricity Regulatory Commission) నిర్ణయంపై జగదీష్‌ రెడ్డి ఫైరయ్యారు. ప్రజలకు విద్యుత్‌ దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. 

కాగా, మంత్రి జగదీష్‌ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఈఆర్‌ఎసీ అదానీకే లాభం. కేంద్రం తెచ్చేవి సంస్కరణలు కావు. ప్రజలను పీల్చి పిప్పి చేసే నల్ల చట్టాలు. సంస్కరణల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ప్రజల డబ్బు దోచిపెట్టేందుకే కేంద్రం దుర్మార్గం చేస్తోంది. దేశ సంపదను ఒక్కరిద్దరికే కట్టబెట్టే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కృత్రిమ విద్యుత్ సంక్షోభం సృష్టించి అదానీకి మేలు చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తుంది.

దేశంలో సొంత బొగ్గువనరులు ఉండగా కేంద్రం విదేశీ బొగ్గు ఎందుకు తెస్తుంది. అదానీ విదేశీ బొగ్గుని బలవంతంగా రాష్ట్రాలకు కేంద్రం అమ్మిస్తున్నది. విదేశీ బొగ్గుతోనే విద్యుత్ సమస్య ఏర్పడనుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న ఉచిత ఆపే ప్రసక్తే లేదని తెలిపారు. రైతులకు సీఎం కేసీఆర్‌ ఉచిత విద్యుత్‌ అందిస్తుంటే అది కేంద్రానికి కడుపు మంటగా ఉందని ఆరోపణలు చేశారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement